Thursday, December 12, 2013

జాన జాన పదాలతో జ్ఞానగీతి పలుకునటే ఆనంద లీల

గీతా జయంతి శుభాకాంక్షలు. నేను B.Tech లో ఉన్నప్పుడు ఒకసారి సీక్రెట్ ఒఫ్ కాన్సెంట్రేషన్ అని ఒక బుక్ చదివాను. అందులో ఏవో టెక్నీక్స్ చెబుతూ మధ్యలో భగవద్గీత లో ఒక శ్లోకం వస్తుంది. అర్జునుడు మనస్సును కంట్రోల్ చెయ్యడం గాలిని కంట్రోల్ చెయ్యడం కన్నా కష్టం అని అంటే కృష్ణుడు అవును కానీ అభ్యాస వైరాగ్యాల ద్వారా ఆది సాధ్యమవుతుంది అని చెపుతాడు. దీన్ని చెప్పి కాన్సెంట్రేషన్ తో చదవటానికి అభ్యాసం కావాలి అని కొన్ని టెక్నీక్స్ చెప్పారు. నేను అప్పుడు ఆది ట్రై చేసినపుడు ఆది వర్క్ అయ్యింది. అప్పుడు అనుకున్నాను రెండు శ్లోకాలకే ఇంత లాభం ఉంటే మొత్తం చదివితే ఎలా ఉంటుంది అని. ఇలా నా జీవితంలో మొదటి సారి భగవద్గీత ప్ర్యాక్టికల్ గా టచ్ లోకి వచ్చింది.
అంతకుముందు మహా భారతం చదివినప్పుడు వచ్చింది కాని అప్పుడు ఒక్క ముక్క కుడా అర్థం కాలేదు. మా మావయ్య చదువుతాడు కాబట్టి నాకూ చదవటానికి ఆసక్తి కలిగింది. భగవద్గీత చదివితే నా జీవితంలో ఏదో జరిగి పోతుంది అని భయం లేకుండా మార్పు జరిగినా ఇది మంచి చేస్తుంది అని ఒక నమ్మకం ఉంది. B.Tech లో final year లో చిన్న భగవద్గీత, only translations,  ఉంటే చదివాను. కాని అప్పడు కుడా  పెద్దగా  అవగాహన అవలేదు. M.Tech లో పెద్ద భగవద్గీత కొని చదవటం మొదలుపెట్టాను. అప్పటి నుంచి భగవద్గీత నా జీవితంలో ఒక part అయ్యింది.

మొదట్లో random గా శ్లోకాలు చదివి దాని meaning చదివే వాడిని. చాలా interesting శ్లోకాలు తగిలేవి.
ఉదాహరణకు BG 17.15, మంచిగా మాట్లాడటానికి ఉండే 5 లక్షణాలను కృష్ణుడు చెపుతున్నాడు, ఉద్వేగంగా లేకుండా, సత్యమైనది, ప్రియమైనది, హితమైనది గా ఉండాలి అని. పాటించడానికి చాలా కష్టమైనా పాటించడానికి ప్రయత్నించదగినది. 

మూడు రకాలైన happiness చెప్పబడినవి , BG 18.37, BG 18.38, BG 18.39, ఒకటి ముందు విషంలా ఉండి తరువాత అమృతంలా ఉండి  మన నిజమైన స్థితిని తెలుసుకునేందుకు ఉపయోగపడేది, రెండవది ముందు అమృతంలా ఉండి తరువాత విషంలా మారేది, మూడవది నిద్ర, బద్ధకం ద్వారా వచ్చే ఆనందం . ప్రతీసారీ మన mood మారిపొతూ ఉంటుంది, కాని ఎక్కువ సార్లు మొదటి happiness ఉండేలా ప్రయత్నించాలి అనుకున్నాను.
తరువాత systematic గా మొత్తం చదివాను, lectures ఉంటే విన్నాను.  ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి.

first chapter అంతా అర్జునుడి reasoning ఉంటుంది. మొదటి సారి ఇది చదివిన వాళ్ళకు అర్జునుడు యుద్ధం చెయ్యననటానికి reasons అన్ని చాలా కరెక్ట్ గా ఉన్నట్టు ఉంటాయి. ఐనా యుద్ధం ఎలా చేశాడు అనిపిస్తుంది.

second chapter మొదటి సగం అంతా body కి soul కి తేడా, reincarnation గురించి ఉంటుంది. అర్థం చేసుకోవడం మరియు నమ్మడం కష్టమే అయినా reincarnation మీద చాలా books చదివి research చేసి (ఏదో కొద్దికొద్దిగా websites చదవడం, videos చూడటం, తెలిసినవాళ్లు చెప్పిన స్టోరీస్ వినడం ), reincarnation కరెక్టే అని నమ్మాను.

second chapter మిగిలిన సగం అంతా చాలా interesting topics వస్తాయి. స్థితప్రజ్ఞుడు అనే concept వస్తుంది. ఈ రెండు శ్లోకాలు చాలా famous, BG 2.62 , BG 2.63, మనకి కోపం ఎందుకు వస్తుంది, దాని వల్ల ఎలా పతనమవుతాము అనేది ఉంటుంది.

third chapter లో కర్మ యోగం గురుంచి చెప్పిన తరువాత last లో అర్జునుడు, "ఒకడు rape తప్పని తెలిసి కుడా ఎందుకు చేస్తాడు (BG 3.36 indirect గా )" అని అడుగుతాడు. కృష్ణుడు సమాధానం చెప్పి మన శరీరంలో heirarchy చెబుతాడు. (BG 3.42).  dull matter < senses < mind < intelligence <soul. senses control చెయ్యాలంటే mind వాడాలి, mind control చెయ్యాలంటే intelligence వాడాలి. అంతకుముందు mind and intelligence అని రెండు elements ఉన్నాయని తెలియదు . 

మొదట్లో కాస్త త్వరగా అర్థమయింది అనుకున్నది 14th chapter. సత్త్వ, రజ , తమ అని మూడు గుణాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి అని ఉంటుంది (three roses ad లాగా ). M.Tech లో చాలా రోజులు early morning 2am to 4am పడుకుని పోద్డున్నే 9:30am కి లేదా  1:30pm కి  లెగిచే వాళ్ళలో నేనూ ఒకడిని. ఎందుకంటే 9:30am కన్నా late అయితే breakfast miss  అవుతాము, 2pm కన్నా లేట్ ఐతే lunch miss అయిపోతాము. ఈ habit ని ఎలా అన్నా పోగొట్టుకోవాలి అని ప్రయత్నించే వాడిని. ఈ chapter చాలా సార్లు system లో play చేసేవాడిని. recent గా faking news లో ఒక funny fake article ఏంటంటే IIT students morning sunrise చూడట్లేదని artificial sunrise arrange చేశారట. సత్త్వ గుణం లోకి రావాలి అని ప్రయత్నించడానికి ఈ chapter motivation ఇస్తుంది. ఇంకా ముందుకు తీసుకు వెళ్లి మూడు గుణాలను దాటడానికి భక్తి చేయాలని చెబుతుంది.

కొన్ని important శ్లోకాలను  కంటస్థం (బట్టీ ) చేయాలనుకున్నాను. నాకు ముఖ్యంగా 7th and 9th chapters బాగా నచ్చాయి. శ్లోకాలు గుర్తుపెట్టుకోవడం చాలా help చేసింది/చేస్తుంది. ఒక్కొక్క situation లో ఒక శ్లోకం గుర్తుకు వచ్చి మంచి వైపు అడుగు వేసినప్పుడు వచ్చే మజాయే వేరు. ఇంకా భగవద్గీత flow అర్థం కావాలన్నా బాగా ఉపయోగపడుతుంది. కొన్ని శ్లోకాలు చాలా rythmic గా ఉంటాయి. వాటిని చదువుతుంటేనే ఆనందం వస్తుంది (ex : BG 4.29). ఇంకా శ్లోకం తెలిస్తే sankrit కూడా అర్థమై ఎవరైనా తప్పు చెబితే తెలిసిపోతుంది.

చాలా మంది ఆచార్యులు చాలా commentaries చెప్పారు. logical గా వాళ్ళు చెప్పే commentaries చాలా interesting గా ఉంటాయి. Ex : first chapter లో కౌరవ యోధుల names చెప్పేటప్పుడు సైంధవుడి పేరు ఉండదు. ఎందుకంటే అతను అంత గొప్ప యోధుడు కాదు. కాని కృష్ణుడు విశ్వరూపం చూపినప్పుడు సైంధవుడు కూడా చనిపోతున్నాడు అని అర్జునుడికి చూపిస్తాడు. ఎందుకంటే 12రోజుల తరువాత అర్జునుడు యుద్ధం లో అభిమన్యుడి చావుకి కారణమైన సైంధవుడిని సాయంత్రం లోగా చంపుతాను లేదా ప్రాయోపవేశం (suicide ) చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. So దాన్ని నువ్వు నేరవేరుస్తావు అని కృష్ణుడు ఇక్కడ ముందే చెపుతున్నాడు. మహాభారత యుద్దంలో అన్ని రోజులలో కెల్లా ఆ రోజు యుద్ధం చాలా interesting  గా జరుగుతుంది.

జ్ఞానంలో రకాలు చెప్పేటప్పుడు humility (అమానిత్వం) ని (BG 13.8-12) మొట్టమొదటి అంశంగా చెప్పాడు. ఇంకా భగవద్గీత చదువుతున్న వారు నన్ను వాళ్ళ యొక్క intelligence తో పూజిస్తున్నారు అని చెప్పాడు(BG 18.70). Last శ్లోకంలో కృష్ణుడు అర్జునుడు ఎక్కడ ఉంటారో  అక్కడ ఐశ్వర్యం, విజయం, power, నీతి ఉంటాయని వస్తుంది.   మా అమ్మమ్మ కు ఎప్పుడూ ఒక topic లో చెప్పిందే చెప్పటం అలవాటు. భగవద్ గీత topic ఎప్పుడు వచ్చినా ఇది చెప్తుంది. గీత ఒక గంగా నది లాంటిది. మనం చెంబు పట్టుకెళితే చెంబుడు నీళ్ళు వస్తాయి. బిందె పట్టుకెళితే బిందెడు నీళ్ళు వస్తాయి అని. ఇక్కడ ఆ container మన యొక్క humility and enthusiasm ఏమో.

గీతా జయంతి రోజు భగవద్గీత మీద నాకు ఉన్న appreciation ని వ్యక్తం చేయాలనుకున్నాను. ఒక సాధారణ వ్యక్తికి మంచి ఆలోచనలు రావాలంటే మంచి పుస్తకమైనా, మంచి మనిషైనా తోడుండాలి.  భగవద్గీతను నాకు అందించిన అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఇంకా బాగా అర్థమయ్యేటట్లు, పాటించగల శక్తి  కావాలని ప్రార్థన. కాల స్థోమత సరిపోక (మీకు కుడా అని తెలుసు)ఇక్కటితో ముగిస్తున్నాను.